Saturday, August 15, 2015

అష్టా దశ శక్తి పీటములు

అష్టా దశ శక్తి పీటములు

Monday, September 29, 2014

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు


వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు
వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో  దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.
1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు - సంపదలు కలుగుతాయి.
10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు...
1. మేషరాశి - త్రివత్తులు (3)
2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
3. మిధునరాశి - సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
5. సింహరాశి - పంచమవత్తులు (5)
6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
10. మకరరాశి - సప్తమవత్తులు (7)
11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
12. మీనరాశి - పంచమవత్తులు (5)
జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు...
1. మేష లగ్నం - పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం - పంచమవత్తులు (5)
10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం - ద్వివత్తులు (2)

Wednesday, February 3, 2010

పరిచయ వాక్యములు

నిత్య జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న కష్ట సుఖాలకు నవ గ్రహములే కారణము. ఈ నవ గ్రహముల గురించి తెలిపే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రము. మానవుని కష్టాలు, నష్టాలు, దుహ్ఖాలు అనే కారు చీకటి నుంచి , శాంతులు అనే దివ్యమైన వెలుగు ను చూపించే శాస్త్రమే ఈ జ్యోతిష్య శాస్త్రము. పడవ నడుపువానికి చుక్కాని ఎంత అవసరమో, మానవులకు ఈ జ్యోతిష్య శాస్త్రము కూడా అంతే. అలాంటి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మా తాత గారైన అన్నం భట్లు, తండ్రి గారైన నారాయణ మూర్తి గార్లు అభ్య సించి, పది మందికి చెప్పేవారు. అలా వంశపారంపర్యంగా నాకు జ్యోతిష్యం మీద అవగాహన కలిగినది. ఒక సమయంలో తండ్రి మరణించటం, సోదరి మరణించటం, ఉద్యోగం లేకపోవటం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తినాయి. జ్యోతిష్యం తెలిసిన నాకే ఇన్ని సమస్యలు తలెత్తట్టం జరిగింది. ఇంక సామాన్యులకు ఇలా జరిగితే ఎలా? అనే ఉద్దేశ్యంతో ఎన్నో గ్రంధాలను, పరిశీలించి, పరిశోధించి, గురువులను, పండితులను, పామరులను, జ్ఞానులను శాంతుల గురించి అడిగి తెలుసుకొని, నేను ఆచరించి, నా మిత్రులను ఆచరించమని చెప్పి, మంచి ఫలితములు పొందినాము. జాతకము సరిగా లేకున్న ఈ శాంతులను చేసుకొని, జాతకము లేని వారు కూడా శాంతులను చేసుకొని, వారి వారి ఇబ్బందుల నుండి ఉపశమనం పొందగలరని ఆశిస్తున్నాను. మీరు ఏ గ్రహాలకు శాంతులను చేసుకోవాలో తెలియకుండా వుంటే, మీ పేరు, పుట్టిన తేది, నెల, సంవత్సరం, పుట్టిన వూరు వివరాలను నాకు సందేహాలు@జిమెయిల్.కం కి పంపితే, మీకు వారం లోపల మీరు చేసుకోవాల్సిన శాంతులను గురించి మీ మెయిల్ కు పంపటం జరుగుతుంది. ఇది పూర్తి ఉచితం గా చెప్పబడును. ఖచ్చితంగా ఈ శాంతుల మూలంగా మీరు ఇబ్బందుల నుండి దూరమౌతారని, ఆ దేవుని ఆశీస్షులు మీకు ఎల్ల వేళలా ఉంటాయని ఆశిస్తున్నాను.
సర్వే జనాః సుఖినో భవంతు.

Tuesday, January 26, 2010

ధర్మ సందేహాలు

ఈ శీర్షిక మీ కోసం మీకు వచ్చే సందేహాలను తీర్చటం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ శీర్షిక క్రింద మీరు రోజువారి చేయ వలసిన పనులను గురించి, దేవునికి సబందించిన విషయాలు, జాతక భాగానికి సంబందించిన విషయాలు, వాస్తు దోషాల గురించి, వివాహ విషయాలు, శాంతులు, ఆహార విషయాలు, పంచాంగం, వ్రతాల గురించి, పండుగలు జరుపుకొను విధానాలు గురించిన సందేహాలను నా మెయిల్ కి పంపితే ,మీ సందేహాలకు సమాధానాలను ఒక వారం లోపులో సైటులో పెట్టటం జరుగుతుంది. మీ పేరు, వూరుతో పాటు మీ సందేహాలను పంపవలసిన మెయిల్:sandehalu@gmail.com.
 chinni suresh babu,Nellore.
1.దశావతారాల పేర్లు తెలపండి ?
జవాబు:మస్త్య,కూర్మ ,వరాహ,నరసింహ, వామన,శ్రీ రామ ,పరసు రామ,కృష్ణ,బుద్ధ,కల్కి.

Ashok Obulam,Nellore.
2.పురాణాలు ఎన్ని?వాటి పేర్లు తెలపండి?
జవాబు:అష్టాదశ పురానాలు,అనగా 18.అవి:భాగవతం,భవిష్య ,మస్త్య,మార్కండేయ,బ్రహ్మ,బ్రహ్మవైవర్త,బ్రహ్మాండ,విష్ణు,వరాహ,వామన,వాయు,అగ్ని,నారద,పద్మ,లింగ,గరుడ,కూర్మ,స్కాంద పురాణాలు.

Padma Avadanam,Nellore.
3.స్త్రీలు శ్రీ సూక్తం చదువవచ్చా?
జవాబు: అమ్మవారి సూక్తం చదవడంలో అనుమానం వద్దు.నిరభ్యంతరంగా చదవవచ్చు.

కృతజ్ఞతాభి వందనములు

మొదటగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ కీ.శే. కనుమళ్ళ నారాయణ మూర్తి, కళ్యానమ్మ గార్లకు,
నాకు జ్యోతిష్యంలో ప్రాధమిక విద్యను నేర్పించిన జ్యోతిష్య బ్రహ్మ శ్రీ ఆమంచర్ల శ్రీనివాస్ గారికి, ఉన్నత విద్యకు "స్టార్ లార్డ్ ధశాసిష్టం" ద్వారా తోడ్పడిన గురువులు (ఆయనకు ఏకలవ్య శిష్యుడను) జ్యోతిష్య రత్న, దైవజ్ఞ రత్న శ్రీ వేరే కొండప్ప గారికి, నాకు ఈ విధంగా ఇంటర్నెట్ లోవెబ్ సైట్ పెట్టి, పది మందికి సలహాలు ఇవ్వవచ్చు అని, ఈ వెబ్ సైట్ నిర్వహణలో, తయారీలో నాకు సహాయ సహకారాలు అందించిన శ్రీ బాల మురళి గారికి,
జ్యోతిష్య ఋషులైన పరాశర, వరాహమిహిరాచార్యులు, మాన సాగర, జైమిని, నారద, బృగు, కళ్యాణ వర్మ, మంత్రేశ్వర, వైద్య నాద మొదలగు గురువులకు,
నాలో ఆధ్యాత్మిక ఆలోచనలు, విషయాలు పెంపొంధిస్తున్న నెల్లూరు తల్పగిరి రంగనాద స్వామి, షిర్డీ సాయి నాదునికి,
నేను జ్యోతిష్య విద్యను నేర్చుకొనుటకు కావలసిన వేల రూపాయల పుస్తకములు కొని ఇచ్చి, నాచే మొదటగా జాతక చక్రములు చూపించుకొని, పరిహార క్రియలు చేసుకొని సత్పలితములు పొందిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు అనికేపల్లి వాస్తవ్యులు శ్రీ గుమ్మడి రాజ యాదవ్, అల్లూరు వాస్తవ్యులు శ్రీ బండి రాజా రమేష్ రెడ్డి, గోనెల విజయ కుమార్ గార్లకు, దొంతాలి వాస్తవ్యులు శ్రీ చండి హరిబాబు యాదవ్ గారికి, వెంకటగిరి వాస్తవ్యులు శ్రీ బొక్కసం భవానీ నాగేంద్రప్రసాద్ గారికి, నెల్లూరు వాస్తవ్యులు వూరందూరు మల్లిఖార్జున రావు, వెంకట సుబ్బయ్య, ఓబులం అశోక్, రాధాకృష్ణ, ఉప్పాల శ్రీధర్ గార్లకు,

కృతజ్ఞాతాభివంధనములతో

మీ
కనుమళ్ళ అశోక్

Saturday, January 23, 2010

నిత్య కృత్యాలు-రెండో పేజి

  1. సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం కానిదే నిద్ర పోకూడదు.

Thursday, January 21, 2010

ఇతర విషయాలు

  1. పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం , దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలం లభిస్తుంది. అదే గుప్త దానం.
  2. నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో దానిని ధరించుట మంచిది.
  3. జాతి రత్నములు వేలికి ధరించినపుడు నియమాలు పాటించాలి. పాటించని పక్షములో మంచికన్నా చెడె ఎక్కువ జరుగును. ధరించి ఉన్నపుడు స్త్రీసంపర్కము, మైల, శవములు తాకుట, జూదము, బహిష్టులను తాకుట లాంటి దోషముల వల్ల రత్న ప్రభావము నశించును. అట్టి సమయమందు పౌర్ణమి నాడు రాత్రి మేకపాలు తెచ్చి , వాటితో శుద్ధి చేసేది. (లేదా) పసుపు నీళ్ళు తో శుద్ధి చేసి ,సాంబ్రాణి పొగ వేసేది.
  4. జాతి రత్నములు ధరించునపుడు ఎన్ని కారేట్లులో పెట్టుకోవాలంటే తొమ్మిది సంవత్సరముల లోపువాల్లకి ఒక కేరెట్ , పదునెనిమిది సంవత్సరములోపు వారు రెండు కేరెట్లు, ఆపై వారికి మూడు కేరెట్లు బరువు ఉండునట్లు ఉంగరము చేఇంచి, అడుగు భాగము ఆరత్నము శరీరమునకు తగులునట్లు ధరించాలి.
  5. మనం వాడే వస్తువులు కొన్ని విరిగి పోతూఉంటై. వాటిని వాడటం శ్రేయస్కరము కాదు. వాటిని పారవేయాలి. ఉదా: అద్దాలు, దేవుని ప్రతిమలు.
  6. కుడి చేత్తో చేయాల్సిన పనులు ఎడమ చేతితో, ఎడమ చేత్తో చేయాల్సిన పనులు కుడిచేతితో చేయరాదు.
  7. రుద్రాక్షలు కార్తీక మాసంలో, సోమవారం రోజున ధరిస్తే మంచిది. అవసరమనుకుంటే ఎపుడైనా ధరించ వచ్చు. కాని ఆవు పాలతో ఆ రుద్రాక్షను కడిగి, నూటయెనిమిది సార్లు ఓం నమ్హ శివాయ మంత్ర జపం చేసి ధరస్తే మంచిది.
  8. కాకి తలపై తన్నిన, తగిలిన దోషం, వెంటనే తలస్నానం చేసి, శివ దర్శనము చేసుకోవాలి. ఎక్కువ సార్లు అలా జరిగిన మూడు రకాల నూనెలతో దీపం వెలిగించాలి, మరియు శివునకు రుద్రాభిషేకం చేఇంచేది.
  9. నూనె క్రింద పడితే శుబ్రం చేసుకోండి గాని దానిని ఎత్తి గిన్నెలో పోసుకొని వాడవద్దు.
  10. చీకటి పడిన తర్వాత ఇల్లు వూడవరాదు.(చిమ్మ రాదు)
  11. శనివారం రోజు నూనెతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేయరాదు.